Rishab Shetty’s First Look As Chhatrapati Shivaji Maharaj | ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో కనిపించనున్నారు రిషబ్ శెట్టి ( Rishab Shetty ).
కన్నడ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి మరో ప్రయోగత్నాక సినిమాలో కనిపించనున్నారు. కాంతారా ( Kantara ) బ్లాక్ బస్టర్ అవ్వడంతో వరుస సినిమాలు చేస్తూ రిషబ్ బిజీగా మారారు.
ఇప్పటికే కాంతారా ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. అలాగే ప్రశాంత్ వర్మ ( Prashanth Varma ) దర్శకత్వంలో వస్తున్న ‘ జై హనుమాన్ ‘ ( Jai Hanuman ) సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో రిషబ్ నటిస్తున్నారు.
తాజగా ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్’ ( The Pride Of Bharath: Chhatrapati Shivaji Maharaj ) సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను ఆయన విడుదల చేశారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 జనవరి 21 విడుదల అవుతుందని రిషబ్ ప్రకటించారు.
ఈ సందర్భంగా ‘ ఇది కేవలం సినిమా కాదు, అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, అత్యంత శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసిన ఓ వీరుడి చరిత్ర. ఎప్పటికీ మరిచిపోలేని వారసత్వాన్ని సృష్టించిన ఒక యోధున్ని గౌరవించేందుకు ఇది ఒక యుద్ధ నినాదం’ అని చెప్పారు రిషబ్ శెట్టి.