Revanth Reddy Pressmeet | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసిన తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గులాబీ అధినేత కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ ను ఓడగడుతున్నామని చెప్పారు.
శ్రీకాంతా చారి ప్రాణ త్యాగం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని అకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాడని గుర్తు చేశారు.
శ్రీకాంతా చారి త్యాగానికి, ఎన్నికల తేదీకి ఒక లింక్ ఉంది. డిసెంబర్ 3న శ్రీకాంతా చారి తన తుదిశ్వాస విడిచాడు.
డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వం డని సోనియాగాంధీ విజ్ఞప్తికి తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలిపారు.
నాలుగు కోట్ల ప్రజలకు ధన్య వాదాలు తెలుపుతున్నా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ లాగా కాంగ్రెస్ నేతలు నిరంకుశంగా ఉండబోరని తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయాల్లో విపక్షాల అభిప్రాయాలకు విలువ ఉంటుందన్నారు. ప్రజలంటే బీఆర్ఎస్ నాయకులకు చిన్న చూపు ఉందని విమర్శించారు.
ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బి ష్ అని కేటీఆర్ అం టున్నా రు. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు.