Revanth Reddy Challenges Kcr| ఎన్నికల ప్రచారం లో భాగంగా అధికార బీఆరెస్ ( Brs ) మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ ( Congress ) ల మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.
ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ ( TPCC Chief ) రేవంత్ రెడ్డి కేంద్రంగా బీఆరెస్ నేతలు, ఎంఐఎం ( Aimim ) నేతలు విరుచుకుపడుతున్నారు. వారి విమర్శలకు ఘాటుగా బదులిస్తున్నారు రేవంత్ రెడ్డి. తాజగా బీఆరెస్ అధినేత కేసీఆర్ కు మరో సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్.
ఈ మేరకు కామారెడ్డి ( Kamareddy ) నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ( Shabbir Ali ). ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్..తెలంగాణలో గత ఆరు నెలలుగా రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చుoటే కేసీఆర్ ( Kcr ) నిరూపించాలని సవాల్ విసిరారు.
Revanth Challenge On 24 Hour Free Power| ఈ అంశం పై కామారెడ్డి చౌరస్తా లో చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు.
24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను పోటీ చేస్తున్న కొడంగల్ ( Kodangal ) మరియు కామారెడ్డి స్థానాల నుండి నామినేషన్ ను ఉపసంహరించుకుంటా అంటూ స్పష్టం చేశారు ఆయన. సబ్ స్టేషన్స్ ( Sub Stations ) లాగ్ బుక్స్ తీసుకొని కామారెడ్డి కి రావాల్సిందిగా డిమాండ్ ( Demand ) చేశారు.
బుధవారం సాయంత్రం 3 గంటకు వరకు నామినేషన్ ఉపసంహరణ కు సమయం ఉందని, 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే నామినేషన్ ను విత్ డ్రా ( Withdrawn ) చేసుకుంటానని పేర్కొన్నారు రేవంత్.
ఒకవేళ నిరూపించలేని పక్షాన కామారెడ్డి ప్రజల సాక్షిగా ముక్కు నేలకు రాయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షులు.