Sunday 29th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఢిల్లీలో గణతంత్ర వేడుకలు.. ఈ సారి ప్రత్యేకత ఏంటంటే!

ఢిల్లీలో గణతంత్ర వేడుకలు.. ఈ సారి ప్రత్యేకత ఏంటంటే!

 Republic Day Parade – 2025 | యావత్ దేశం గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది. ఇందులో భాగంగ దేశ రాజధాని ఢిల్లీలో కర్తవ్యపథ్ లో జరిగిన గణతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ( Droupadi Murmu ) జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ( Prabowo Subianto ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి సైనిక బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ), ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ( Jagdeep Dhankhar ) మరియు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర శాఖలకు సంబంధించిన 31 శకటాలను ప్రదర్శించారు.

రాష్ట్రపతి భవన్ నుండి ఎర్రకోట వరకు సుమారు 9 కి.మీ. మేర రిపబ్లిక్ డే పరేడ్ ను ఏర్పాటు చేశారు. కర్తవ్య పథ్ పై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. త్రివిధ దళాలు సంయుక్తంగా శకటాన్ని తీసుకురావడం ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions