RCB Emotional Post | మూడు నెలల కిందట బెంగళూరులో ఐపీఎల్ టైటిల్ (IPL Title Winning Celebrations) విజయోత్సవాల సందర్భంగా ఘోర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 56 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) మౌనం వీడింది.
ఈ మేరకు ఆర్సీబీ (RCB) ఫ్రాంచైజీ గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ మెసేజ్ ను పంచుకుంది. ఈ సందర్భంగా ‘ఆర్సీబీ కేర్స్’ పేరిట ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
“గత మూడు నెలలుగా మా నిశ్శబ్దానికి కారణం ఆ ఘటన మిగిల్చిన దుఖం. జూన్ 4వ తేదీ అన్నింటినీ మార్చేసింది. ఆ రోజు మా గుండెలు పగిలాయి.
ఈ బాధలో నుంచే మా అభిమానులకు అండగా నిలబడాలనే ఆలోచనతో ‘ఆర్సీబీ కేర్స్’కు ప్రాణం పోశాం.
ఇది కేవలం ఓ స్పందన కాదు, మా అభిమానులను గౌరవించడానికి, వారి గాయాలను మాన్పడానికి మేం వేస్తున్న ఓ ముందడుగు. వేడుకతో కాదు, బాధ్యతతో మీ ముందుకు వస్తున్నాం” అని ఆర్సీబీ తమ అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో పోస్టులో పేర్కొంది.










