RCB sensation Lauren Bell | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 రసవత్తరంగా కొనసాగుతుంది. ఓ వైపు జట్లు పోటాపోటీగా తలపడుతుంటే మరోవైపు అభిమానులు మాత్రం ఓ అందగత్తె కోసం తెగ వెతికేస్తున్నారు. ఆమెనే బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న లారెన్ బెల్. డబ్ల్యూపీఎల్ లో భాగంగా మ్యాచులు ఆడుతున్న ఇంగ్లాండ్ బౌలర్ లారెన్ బెల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నారు. ఆరడుగుల ఎత్తున్న ఆమె తన అద్భుతమైన బౌలింగ్ తోనే కాకుండా తన అందంతో కూడా అభిమానుల్ని మంత్రముగ్దుల్ని చేస్తున్నారు. తొలి మ్యాచ్ ఆడిన గంటల వ్యవధిలోనే లారెన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు ఫాలోవర్ల క్యూ పెరిగింది.
దింతో మిలియన్ ఫాలోవర్లు ఆమె సొంతం అయ్యారు. ఇంగ్లాండ్ కు చెందిన ఈ బౌలర్ లో గతేడాది జరిగిన ఆక్షన్ లో కేవలం రూ.90 లక్షలకే బెంగళూరు ఫ్రాంఛైజీ దక్కించుకుంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ లారెన్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి సత్తా చాటింది. 2001లో ఇంగ్లాండ్ లోని విల్ట్ షైర్ లో జన్మించిన లారెన్ కు ఫుట్బాల్, క్రికెట్ రెండు ఆటల్లోనూ మంచి ప్రావీణ్యం ఉంది. అయితే క్రికెట్ పై మక్కువతో ఇందులోనే కెరీర్ కొనసాగించింది. ఇలా 2022లో ఇంగ్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు.









