Raviteja Father Passed Away | టాలీవుడ్ నటుడు రవితేజ (Raviteja) కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (Rajagopal Raju) కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్యం నుంచి బాధపడుతున్న రాజగోపాల్ రాజు హైదరాబాద్ లోని నివాసంలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
రాజగోపాల్ రాజుకు రవితేజ సహా ముగ్గురు కుమారులు. రవితేజ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు భరత్ 2017లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. చిన్న కుమరుడు రఘు కూడా నటుడిగా కొనసాగుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజగోపాల్ రాజు ఫార్మాసిస్ట్ గా పనిచేశారు. తన ఉద్యోగరీత్యా దిల్లీ, ముంబై, జైపూర్ తదితర నగరాల్లో పనిచేశారు.
రాజగోపాల్ రాజు మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మరణం బాధ కలగజేసిందనీ, కష్ట సమయంలో ఆయన కుటుంబానికి తన సానుభూతి తెలిపారు చిరంజీవి. రవితేజ కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు దర్శకుడు గోపిచంద్ మలినేని ట్వీట్ చేశారు.