Ram Gopal Varma Latest | దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు వైరల్ గా మారాయి. ఆదివారం ‘ఫ్రెండ్షిప్ డే’. దింతో స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ యువత ఫ్రెండ్షిప్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
అయితే ఇది ఫ్రెండ్షిప్ డే కాదు ‘అన్ ఫ్రెండ్షిప్ డే’ అని పేర్కొన్నారు ఆర్జీవి. ‘శత్రువులు నిన్ను ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంచుతారు. అదే స్నేహితులు నిర్లక్ష్యంగా ఉండేలా చేస్తారు’. ‘నీకు అత్యంత సన్నిహిత స్నేహితులే నీ రహస్యాలను బహిర్గతం చేస్తారు’.
‘ఒక స్నేహితుడికి సహాయం చేయడంలో సమస్య ఏంటంటే. ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మళ్లీ నీ వద్దకే వస్తాడు. నీవు ఆడుకోకపోతే స్నేహితుడే శత్రువుగా మారుతాడు’. ‘స్నేహితుల మాదిరిగా శత్రువులు వెన్నుపోటు పొడవలేరు’ అని ఆర్జీవి వరుస పోస్టులు చేశారు. ఈ మేరకు హ్యాపీ అన్ ఫ్రెండ్షిప్ డే అంటూ హాష్ట్యాగ్ జత చేశారు.









