Rajinikanth gifts gold chain to Madurai fan | సూపర్ స్టార్ రజినీకాంత్ సేవా కార్యక్రమాల నుండి స్ఫూర్తి పొందిన ఓ అభిమాని గత కొన్నేళ్లుగా పేదల కోసం తక్కువ ధరకే ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రజినీ అభిమానిని ఇంటికి ఆహ్వానించి, అతన్ని ఘనంగా సన్మానించి బంగారు గొలుసును బహుకరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. తమిళనాడు మధురైకి చెందిన శేఖర్ అనే వ్యక్తి రజినీకాంత్ కు వీరాభిమాని. స్థానికంగా ఓ హోటల్ ను ఏర్పాటు చేసి కేవలం రూ.5కే పరోటాలను అమ్ముతున్నారు. పేద ప్రజల కోసం ఇలా చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఆ హోటల్ బోర్డుపై రజినీ ఫోటోను పెట్టుకోవడమే కాకుండా చేతిపై పచ్చబొట్టు సైతం పొడిపించుకున్నారు. అందుకే అతని గురించి తెలిసినవారు ఆయన్ను రజిని శేఖర్ అని పిలుస్తారు. కాగా రూ.5కే పరోటాలను విక్రయిస్తన్న వార్తలు, వీడియోలు సూపర్ స్టార్ వరకు చేరాయి. దింతో తాజగా అభిమానిని రజిని తన ఇంటికి ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో కలిసివచ్చిన శేఖర్ తన అభిమాన నటుడిని కలిశారు. ఈ సందర్భంగా శేఖర్ ను రజిని ఘనంగా సత్కరించారు. శాలువాతో సత్కరించి బంగారు గొలుసును బహుకరించారు.









