Rajamouli meets Kenya minister amid SSMB 29 shoot | సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ భారీ ప్రాజెక్టు తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. SSMB-29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ కొనసాగుతుంది.
ప్రస్తుతం ఆఫ్రికా లోని కెన్యా దేశంలో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి నేతృత్వంలోని చిత్ర బృందం కెన్యా దేశ మంత్రి ముసాలియా ముదావాదిని మర్యాదపూర్వకంగా కలిశారు.
కెన్యాలో షూటింగ్ జరుగుతుండటం పట్ల ఆ దేశ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించిన అనంతరం 120 మందితో కూడిన టీం కెన్యాను ఎంచుకోవడం పట్ల ఆ దేశ మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
మసాయి మరా మైదానాల నుంచి నైవాశా, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రాంతాలు ఎస్ఎస్ఎంబీ 29 మూవీలో కనిపించబోతున్నట్లు పేర్కొన్నారు. 120 దేశాల్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు, 100 కోట్ల మందికి చేరువవుతుందని ఈ క్రమంలో కెన్యా అందాలను అందరూ చూడబోతున్నారని తెలిపారు.









