Rahul Gandhi to adopt 22 children orphaned by Pakistani shelling in Poonch | లోకసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గొప్ప మనసును చాటుకున్నారు.
జమ్మూకశ్మీర్ పూంఛ్ జిల్లాలో ఆపరేషన్ సింధూర్ సమయంలో తల్లిదండ్రులు, కుటుంబాలను కోల్పోయిన 22 మంది చిన్నారులను దత్తత తీసుకోనున్నారు. చిన్నారులు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు వారి ఖర్చుల బాధ్యత మొత్తం రాహుల్ గాంధీ చూసుకొనున్నారు.
ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ హమీద్ ప్రకటించారు. ‘ఆపరేషన్ సింధూర్’ అనంతరం పాకిస్థాన్ భారత్ పై దాడులకు యత్నించింది. ఈ నేపథ్యంలో పూంఛ్ జిల్లాలో పాకిస్థాన్ షెల్లింగ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని దత్తత తీసుకునేందుకు రాహుల్ గాంధీ ముందుకొచ్చారని హమీద్ తెలిపారు.
రాహుల్ గాంధీ మే నెలలో పూంఛ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను, కుటుంబాలను కోల్పోయిన పిల్లల జాబితా సిద్ధం చేయాలని స్థానిక నేతలకు సూచించారు. వారు ఈ మేరకు 22 మంది పిల్లలతో కూడిన జాబితాను సిద్ధం చేశారు.









