Raghurama Krishnam Raju About Pulivendula By Elections | పులివెందులలో బై ఎలక్షన్ రావాలంటూ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.
పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ ( Tdp Incharge ) బిటెక్ రవి, రఘురామ కృష్ణంరాజు ఇతర నాయకులు ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్ ( Prayagraj ) లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లారు. త్రివేణి సంగమంలో స్నానమాచరించారు.
ఈ సందర్భంగా పవిత్ర స్నానమాచరించిన బిటెక్ రవి నదిలో దీపాలను వదిలారు. ఇదే సమయంలో పక్కనే ఉన్న రఘురామ పులివెందుల అసెంబ్లీ స్థానానికి బై ఎలక్షన్ రావాలని కోరుకున్నారు.
ఒకవేళ బై ఎలక్షన్ వస్తే పులివెందుల ఇన్ఛార్జ్ గా మీరే ఉండాలంటూ రఘురామను ఉద్దేశించి బిటెక్ రవి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వీరి సంభాషణ వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా సోమవారం త్రివేణి సంగమంలో మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) దంపతులు పవిత్ర స్నానమాచరించిన విషయం తెల్సిందే. అనంతరం కుమారుడితో కలిసి వారు సెల్ఫీ దిగారు.