- ఇండియా రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్స్ పో లో విజనరీ లీడర్స్ అవార్డు
Visionary Leader Award For Sudheer Sandra | మాటలతో మంత్రముగ్ధుల్ని చేసే ప్రముఖ సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు సుధీర్ సండ్ర (Sudheer Sandra)కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల హైదరాబాద్ లోని హైటెక్స్ లోని నిర్వహించిన ఇండియా రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్స్ పో (IRIE) సందర్భంగా నిర్వహించిన బిజినెస్ ఎమినెన్స్ అవార్డ్స్ (Business Eminence Awards)లో సుధీర్ సండ్రకు విజనరీ లీడర్ పురస్కారం దక్కింది.
డిసెంబర్ 28న నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుధీర్ సండ్ర ఈ అవార్డును అందుకున్నారు. లక్నోలోని అమిటీ యూనివర్సిటీ నుంచి క్లినికల్ సైకాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన సుధీర్ సండ్ర దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై వందల సంఖ్యలో సదస్సులు నిర్వహించారు.
వేల మంది జీవితాలను ప్రభావితం చేశారు. 2022లో మనోవిజ్ఞాన యాత్ర పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. వ్యక్తిత్వ వికాస నిపుణులైన సుధీర్ తన మాటలతో యువతలో స్ఫూర్తి నింపారు. మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసానికి సూపర్ స్కూల్ (SUPAR School) దేశంలోని 600లకు పైగా సంస్థలలో దాదాపు పది లక్షల మందికి శిక్షణ ఇచ్చారు.