Preity Zinta, Congress clash on social media | కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు నటి, ఐపీఎల్ ( IPL ) లో పంజాబ్ టీం సహా యజమాని ప్రీతి జింటా.
ప్రీతి జింటా తన సోషల్ మీడియా ఖాతాలను బీజేపీకి అప్పగించినందుకు గాను న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంక్ లో నటి తీసుకున్న రూ.18 కోట్ల లోన్ ను మాఫీ చేశారని ఎక్స్ ( X ) వేదికగా పోస్ట్ చేసిన కేరళ కాంగ్రెస్. గత వారం కో ఆపరేటివ్ బ్యాంక్ మూతపడడంతో డిపాజిటర్లు రోడ్డున పడ్డారని కేరళ కాంగ్రెస్ ( Kerala Congress ) పేర్కొంది.
ఈ నేపథ్యంలో ప్రీతి జింటా స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాలను తానే నిర్వహిస్తామని, వాటిని బీజేపీకి అప్పగించినట్లు కాంగ్రెస్ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. తన లోన్ ను ఎవరూ మాఫీ చేయలేదని ఇలాంటి ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బ్యాంక్ నుండి తీసుకున్న లోన్ ను 10 సంవత్సరాల క్రితమే తీర్చేసినట్లు స్పష్టం చేశారు.









