Monday 23rd March 2026
12:07:03 PM
Home > తాజా > ది రాజాసాబ్ విడుదలపై క్లారిటీ.. డేట్ ప్రకటించిన నిర్మాత!

ది రాజాసాబ్ విడుదలపై క్లారిటీ.. డేట్ ప్రకటించిన నిర్మాత!

the rajasaab

The Rajasaab Release Date | ప్రభాస్-మారుతీ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘ది రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రొమాంటిక్ హారర్ కామెడీగా వస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే విడుదల తేదీపై క్లారిటీ రావడం లేదని కాస్త నిరుత్సాహానికి గురవుతున్నారు. తొలుత ‘ది రాజాసాబ్’ సినిమాని సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 10న విడుదల చేయాలని భావించారు.

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. కొద్ది రోజుల కిందట డిసెంబర్ 5వ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.   తాజాగా రాజాసాబ్ రిలీజ్ పై నిర్మాత విశ్వప్రసాద్ స్పందించారు.

‘మిరాయ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లుడుతూ 2026 సంక్రాంతి స్పెషల్ గా జనవరి 9న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.  

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions