Friday 18th October 2024
12:07:03 PM
Home > తాజా > అది నిజమని తేలితే నా భూమి రాసిస్తా: పొంగులేటి

అది నిజమని తేలితే నా భూమి రాసిస్తా: పొంగులేటి

ponguleti srinivas reddy

Ponguleti Srinivas Reddy | ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ని కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మన్ గా నియమించింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారి మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ (Gandhi Bhavan)కు వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని (Revanth Reddy) కలిశారు.

తనకు ప్రచార కమిటీ కో చైర్మన్ బాధ్యతలు ఇచ్చిన ఏఐసీసీ, పీసీసీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకరావడానికి కష్టపడి పనిచేస్తానని తెలిపారు.

సోనియా గాంధీ (Sonia Gandhi) తెలంగాణ ఇచ్చిన దేవతగా అభివర్ణించారు.

రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదన్నారు పొంగులేటి. కల్వకుంట్ల కుటుంబం రాజుల పాలన సాగుతోందని మండిపడ్డారు.

Read Also: Next CM NTR.. ఒంగోలులో తారక్ ఫ్లెక్సీల కలకలం!

సీఎం కేసీఆర్ (CM KCR) హామీలు ఇవ్వడం తప్పా అమలు చేయడం లేదని ఆరోపించారు. పథకాలను అట్టహాసంగా లాంఛింగ్ చేయడం తప్ప అమలు చేయడం లేదని విమర్శించారు.

బీఆరెస్ పాలనతో తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీలేదన్నారు. బిఆర్ఎస్ నేతలు అధికార మదంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

“సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కల్వకుంట కుటుంబం ఎక్కడ ఉండేది. కేసీఆర్ దీక్ష చేస్తేనే రాష్ట్రం వచ్చిందా?  

ప్రజలను మభ్యపెట్టి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు” అని మండిపడ్డారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

ఖమ్మంలో భూమి కబ్జా చేశారని వస్తున్న ఆరోపణలను ఖండించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాను 20 గుంటల భూమి కబ్జా చేసానంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు.

తనపై బురదజల్లే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలిపారు.  

“నేను ఖబ్జా చేసినట్లు తెలితే నా భూమి మొత్తం రాసిస్తా. ఎస్ఆర్ గార్డెన్ పడగొట్టాలని చూశారు.

ఆ గార్డెన్ కట్టి 13 సంవత్సరాలు అయింది. అప్పుడే ఎందుకు సర్వే చేయలేదు. రాజకీయ కక్ష్య సాధింపు లకు బీఆర్ఎస్ (BRS) దిగుతుంది.

బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఒకలా.. పార్టీ మారాక ఇప్పుడు మరోలా ఉంటుందా.

కాంగ్రెస్ పై విమర్శల దాడి పెరిగిందంటేనే.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని అర్థం అయింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.  

You may also like
harish rao
హస్తం తీసేసి ఆ గుర్తు పెట్టుకోండి.. కాంగ్రెస్ పై హరీశ్ రావు హాట్ కామెంట్స్!
ponguleti srinivas reddy
తెలంగాణ మంత్రికి షాక్.. ఉదయం నుంచి ఈడీ సోదాలు!
ఖమ్మం వరదలు..బాధితుల కోసం కాంగ్రెస్ భారీ విరాళం
ktr
చట్నీలో ఎలుక పరుగులు..రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఫైర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions