Police Alerts Over Cyber Crimes | సైబర్ నేరాలకు (Cyber Crimes) సంబంధించి తెలంగాణ పోలీసులు ప్రజలను మరోసారి అప్రమత్తం చేశారు. ముఖ్యంగా వాట్సాప్ స్క్రీన్ షేరింగ్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరంచారు.
వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఇన్వెస్ట్ మెంట్ టిప్స్ ను నమ్మి పెట్టుబడులు పెట్టొద్దని సూచించారు. తెలియని వ్యక్తులు చేసే ఆకర్షణీయమైన ప్రచారం వెనుక మోసం ఉండొచ్చనీ, ఫేక్ స్క్రీన్ షాట్స్, ఫేక్ యాప్స్ తో మోసగిస్తారని తెలిపారు.
పెట్టుబడి అనే కీలకమైన నిర్ణయాన్ని అపరిచితుల సలహాలను నమ్మి తీసుకోవద్దని హెచ్చిరించారు. కస్టమర్ సపోర్ట్, బ్యాంక్ సిబ్బంది పేరిట కాల్స్ చేసి వాట్సాప్ స్క్రీన్ షేరింగ్ ఇవ్వాలని కోరితే అస్సలు నమ్మొద్దు. సాయం చేస్తామని నమ్మించి మీ అకౌంట్‌లోని డబ్బులు కాజేస్తారు.
మీ సన్నిహితులు, ఇంట్లోని పెద్దలకు ఇలాంటి మోసాలపై అవగాహన కల్పించండి. అని సూచించారు. అదేవిధంగా, సైబర్ మోసాలపై మీ చిన్నారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆర్ధిక సంబంధిత మోసాలు జరిగే తీరుతో పాటూ, వాటి బారిన పడుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించాలని తెలిపారు.
ఆన్‌లైన్ గేమ్స్ మాటున ఉండే సైబర్ మోసాలను కూడా వివరించాలని సూచించారు. వారి వెబ్ యాక్టివిటీని తరచూ పరిశీలించండంటూ జాగ్రత్తలు తెలిపారు.









