PM Modi Reacts On HCU Kancha Gachibowli Lands Row | తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు ప్రధాని నరేంద్ర మోదీ. హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి భూములపై ఇటీవల వివాదం నెలకొన్న విషయం తెల్సిందే.
ఈ క్రమంలో స్పందించిన ప్రధాని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తూ, పర్యావరణానికి హాని కలిగిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలన్న నిర్ణయంపై విమర్శలు గుప్పించారు.
“ఒకవైపు మేము పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో అటవీ భూములను, వన్యప్రాణులను, ప్రకృతిని నాశనం చేస్తోంది. గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ ప్రజలను మోసం చేసింది” అని విమర్శించారు.