PM Modi interacts with Shubhanshu Shukla | భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ సంస్థ నిర్వహిస్తున్న యాక్సియం-4 (Ax-4) మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయం తెల్సిందే.
కాగా శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వీడియో కాల్ ద్వారా శుభాంశు శుక్లా సంభాషించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాంశు శుక్లాను అభినందిస్తూ, ఈ మిషన్ భారతదేశ అంతరిక్ష రంగంలో ఒక మైలురాయిగా పేర్కొన్నారు. శుభాంశు 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లారని, ఇది దేశ యువతకు స్ఫూర్తినిచ్చే సంఘటన అని మోదీ అన్నారు.
శుభాంశు తన అనుభవాలను పంచుకున్నారు, ఐఎస్‌ఎస్‌లో నిర్వహిస్తున్న పరిశోధనల గురించి వివరించారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్ల భూమికి దూరంగా ఉండొచ్చు కానీ భారతీయుల హృదయాలకు మాత్రం చాలా దగ్గరగా ఉన్నారని ప్రధాని అభినందించారు.
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు ఐఎస్‌ఎస్‌లో 14 రోజుల పాటు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించనున్నారు.