PM Modi Gifts Gangajal From Maha Kumbh To Mauritius President | ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ దేశంలో పర్యటిస్తున్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం మినీ ఇండియా గా పిలుచుకునే మారిషస్ కు ప్రధాని వెళ్లారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం నుండి సేకరించిన పవిత్ర గంగాజలన్ని ప్రధాని, మారిషస్ అధ్యక్షుడికి బహుమతిగా ఇచ్చారు. మహా కుంభమేళా నుండి తీసుకువచ్చిన గంగాజలన్ని స్వీకరించిన మారిషస్ అధ్యక్షుడు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ప్రత్యేక విందులో ప్రధాని పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం కంటే ముందు ఆ దేశ ప్రధాని నవీన్ రామ్ గోలంతో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆ దేశ జాతిపిత సీవోసాగర్ రామ్ గోలం పేరు మీద ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్ ను మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని, మారిషస్ ప్రధానితో కలిసి మొక్కలు నాటారు.
‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమంలో అమ్మ పేరిట మొక్కను నాటడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఫోటోలను పంచుకున్నారు.
కాగా భారత ప్రధానిగా మూడవ సారి ప్రమాణ స్వీకారం చేసిన మోదీ తన తొలి ‘మన్ కీ బాత్’ ద్వారా అమ్మ పేరిట ప్రతీ ఒక్కరు మొక్కను నాటాలని పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.