Friday 18th October 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > సమ్మక్క-సారక్కల పరాక్రమాన్నిగుర్తుచేసుకుందాం: మోదీ

సమ్మక్క-సారక్కల పరాక్రమాన్నిగుర్తుచేసుకుందాం: మోదీ

modi

Modi Greetings On Medaram Festival | ప్రతి రెండేండ్లకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క ల జాతర బుధవారం నుండి ప్రారంభం అయ్యింది. దక్షిణ భారత కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరలో వనదేవతలకు మొక్కులు చెల్లించడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

బుధవారం నుండి మొదలుకొని, నాలుగు రోజుల పాటు ఈ జాతర ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో మేడారం జాతర ప్రారంభం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ.

” గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే చైతన్యవంతమైన వ్యక్తీకరణ అయిన ఈ  సమ్మక్క-సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు.

ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం.” అని తెలిపారు మోదీ. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
modi
పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని పర్యటన!
pm modi
కోటి మంది మహిళలను లక్షాధికారులను చేస్తాం: ప్రధాని మోదీ
PM Modi
సమ్మక్క-సారక్క పరాక్రమాన్నిగుర్తుచేసుకుందాం: ప్రధాని మోదీ
Sajjanar
మేడారం జాతర షురూ.. ప్రయాణికులకు సజ్జనార్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions