Saturday 21st March 2026
12:07:03 PM
Home > క్రీడలు > ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు..

ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు..

Player of the month award..

బ‌రిలో ఇద్ద‌రు బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు ICC : అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ న‌వంబ‌ర్ నెలకు ప్ర‌తిష్ఠాత్మ‌క ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్’అవార్డు నామినీస్ పేర్ల‌ను వెల్ల‌డించింది. ఐసీసీ ప్ర‌తి నెలా అందించే ఈ అవార్డుకు ఈసారి మ‌హిళ‌ల విభాగంలో ఇద్ద‌రు బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు…
అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ న‌వంబ‌ర్ నెలకు ప్ర‌తిష్ఠాత్మ‌క ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్’ అవార్డు నామినీస్ పేర్ల‌ను వెల్ల‌డించింది. ఐసీసీ ప్ర‌తి నెలా అందించే ఈ అవార్డుకు ఈసారి మ‌హిళ‌ల విభాగంలో ఇద్ద‌రు బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు పోటీ ప‌డుతున్నారు. బంగ్లా నుంచి న‌హిదా అక్త‌ర్ ఫ‌ర్గానా హ‌క్నామినేట్ అయ్యారు. వీళ్ల‌తో పాటు పాకిస్థాన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ స‌దియా ఇక్బాల్‌కూడా పోటీలో నిలిచింది.
బంగ్లాదేశ్ స్పిన్ సెన్షేష‌న్ న‌హిదా న‌వంబ‌ర్‌లో జ‌రిగిన పాకిస్థాన్ సిరీస్‌లో అద‌ర‌గొట్టింది. మూడు వ‌న్డేల సిరీస్‌లో న‌హిదా త‌న సంచ‌ల‌న స్పెల్‌తో 7 వికెట్లు తీసింది. దాంతో బంగ్లా 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది. ఇక 30 ఏండ్ల ఫ‌ర్గాన ఇదే సిరీస్‌లో టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. ఈ కుడి చేతివాటం బ్యాట‌ర్ 36.62 స‌గటుతో 110 ప‌రుగులు చేసింది.
పాక్ స్పిన్న‌ర్ స‌దియా బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌లో చెల‌రేగింది. అత్యుత్త‌మంగా 2.58 ఎకాన‌మీతో సాదియా 6 వికెట్లు ప‌డ‌గొట్టింది. ఈ ముగ్గురిలో ఎవ‌రూ విజేత‌ను తేల్చేందుకు ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఎక్కువ ఓట్లు వ‌చ్చిన వాళ్ల‌ను విజేత‌గా ప్ర‌క‌టిస్తారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions