Tuesday 17th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > సౌత్ యోగి ఆదిత్యనాథ్ గా పవన్ కళ్యాణ్ ?

సౌత్ యోగి ఆదిత్యనాథ్ గా పవన్ కళ్యాణ్ ?

Pawan Kalyan Trying To Be Yogi Adityanath Of South? | హార్డ్ కోర్ ( Hardcore ) హిందుత్వ పాలిటిక్స్ ( Politics ), మైనారిటీ బుజ్జగింపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ యోగి అదిత్యనాథ్ ( Yogi Adityanath ) రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు.

ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) కూడా సౌత్ ( South India ) యోగిలా మారెందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన పార్టీని స్థాపించిన మొదట్లో చేగువేరా ( Che Guevara ), కాస్ట్రో ( Castro ) నుండి స్ఫూర్తి పొందానని చెప్పిన పవన్, ఇప్పుడు రైట్ వింగ్ ( Right Wing ) పాలిటిక్స్ వైపు మళ్లారు.

తిరుమల లడ్డు అంశం, పలు దేశాల్లో హిందువులపై జరుగుతున్న దాడులపై, సనాతన ధర్మం గురించి పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన భవిష్యత్ లో ఎలాంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నారో అనేది సూచిస్తుంది. ఇప్పటికే సనాతన ధర్మ రక్షణ కోసం నరసింహ వారాహి బ్రిగేడ్ ( Brigade ) ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

కేవలం సనాతన ధర్మం గురించే కాకుండా లా అండ్ ఆర్డర్ ( Law And Order ) విషయంలో కూడా యోగి ఆదిత్యనాథ్ లా వ్యవహరించాలని ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, తన ఓటు బేస్ ను పెంచేందుకు, భవిష్యత్ లో జనసేన పార్టీని విస్తరించేందుకు, పవన్ కళ్యాణ్ , యోగి ఆదిత్యనాథ్ మాదిరిగా రాజకీయంగా ముందుకు వెళ్తారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions