Saturday 2nd August 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ముగ్గురు కూతుర్లు వాలంటీర్స్..ప్రభుత్వంపై పవన్ ఫైర్

ముగ్గురు కూతుర్లు వాలంటీర్స్..ప్రభుత్వంపై పవన్ ఫైర్

pawan kalyan

Pawan Kalyan On Volunteers| ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఒక వ్యక్తి మాట్లాడుతూ తనకు ముగ్గురు కూతుర్లని వారిలో పెద్దమ్మాయి పీజీ ( Post Graduation ), రెండవ అమ్మాయి సివిల్స్ ( Civils ), మూడవ అమ్మాయి డిగ్రీ ( Degree ) చదివి పట్టాలు కూడా పొందారని చెప్పారు.

కానీ వారికి ఉద్యోగాలు రాలేదని, ఆ సమయంలో వైసీపీ ( Ycp ) ప్రభుత్వం తన ముగ్గురు కూతుర్లను వాలంటీర్స్ ( Volunteers ) గా నియమించిందని తెలిపారు.

ఈ క్రమంలో ఆ సదరు వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు జనసేన ( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ).

రూ.5,200 జీతంతో యువతను గ్రామాలకే కట్టిపడేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రం లోని 33 వేల గ్రామాలు ( Villages ) ఉన్నాయని, గ్రామానికి 10 మంది చెప్పున యువతను కట్టిపడేస్తే ఎంతోమంది బలమైన వ్యక్తులను బయటకు రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉన్నత చదువులు చదివిన యువతకు రూ. 5 వేల జీతం ఇచ్చి సీఎం జగన్ ( Cm Jagan ) వారితో ఊడిగం చేయిస్తున్నారని మండిపడ్డారు. డిగ్రీ చదువులు చదివిన వారికి రూ.5 వేలు ఇస్తుంటే అది ఉద్యోగమా ? లేక ఊడిగమా ? ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు జనసేనాని ( Janasenani ).

You may also like
‘పెట్టుబడులు రాకుండా ఈ-మెయిల్స్ పంపాడు..ఎవరంటే!’
‘బాధితుల కోసం యాప్..మనం వచ్చాక సినిమా చూపిద్దాం’
‘ఏనుగులు సంచరించే ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి’
‘వీరమల్లు సినిమాను బహిష్కరించినా’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions