Pawan Kalyan gifts ₹1 lakh to student who made battery-powered bicycle | విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్థి రాజాపు సిద్ధూ అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించాడు.
దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వినూత్న ఆవిష్కరణను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించి అభినందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా సిద్ధూ ఆవిష్కరణ గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
సిద్ధూ రూపొందించిన సైకిల్‌ను స్వయంగా నడిపి తన ఆవిష్కరణలను పరిశీలించారు. అతని ఆలోచనలను మెచ్చుకుని భవిష్యత్తులో సరికొత్త ఆలోచనల దిశగా అడుగులు వేయాలి అని ఆకాంక్షిస్తూ ప్రోత్సాహకంగా రూ.లక్ష అందించారు. అంతేకాకుండా సైకిల్‌పై సిద్ధూని కూర్చోబెట్టి స్వయంగా నడిపారు.
కాగా విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ, కాలేజీకి వెళ్లేందుకు మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం గల ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను స్వయంగా తయారు చేశాడు. ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.