Friday 30th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > హిందువులకు సంఘీభావం ఎక్కడ ?..పవన్ కళ్యాణ్ ఎమోషనల్

హిందువులకు సంఘీభావం ఎక్కడ ?..పవన్ కళ్యాణ్ ఎమోషనల్

Pawan Kalyan Condemns Canada Temple Attack | కెనడా ( Canada )లో ఇటీవల హిందు ఆలయంపై ఖలిస్తాని ( Khalistani ) మూకలు దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనను ప్రధాని మోదీ ( Pm Modi ) తీవ్రంగా ఖండించారు.

తాజగా కెనడా ( Canada ) ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) స్పందించారు. పాకిస్తాన్ ( Pakistan ), ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan ) మరియు ఇటీవల బంగ్లాదేశ్ ( Bangladesh ) వంటి దేశాల్లో హిందువులు వేధింపులకు, హింసకు గురికావడం తనను తీవ్రంగా బాధించినట్లు పవన్ తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లో హిందువులు మైనారిటీలు అని, వారి సులభంగా లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కెనడాలోని హిందూ దేవాలయంపై మరియు హిందువులపై జరిగిన దాడి హృదయాన్ని కలిచివేసిందని, ఆవేదన మరియు ఆందోళన రెండింటినీ రేకెత్తించినట్లు చెప్పారు.

కెనడా ప్రభుత్వం అక్కడి హిందూ సమాజానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

వివిధ దేశాలలో, హిందువులపై హింసాత్మక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి, అయినప్పటికీ ప్రపంచ నాయకులు, అంతర్జాతీయ సంస్థలు మరియు “శాంతి-ప్రేమికుల” అని పిలవబడే NGOల నుండి ఎటువంటి ఖండనలు రాలేదని నిలదీశారు. హిందువులకు సంఘీభావం ఎక్కడ? అంటూ పవన్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions