One Nation One Election News | జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించి మరో ముందడుగు పడింది.
దేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆ తర్వాత దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ రూపొందించిన నివేదికను ఇటీవలే కేబినెట్ ఆమోదించిన విషయం తెల్సిందే. 18 రాజ్యాంగ సవరణలు అవసరమని ప్యానల్ సిఫార్సు చేసింది.