- టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ లో శైవ, వైష్ణవ ఆలయం
- ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ
- కన్నుల పండువగా సాగిన శ్రీ వేంకటేశ్వర కళ్యాణం
- కార్తీక పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ వ్రతాలు
Hari Hara Kshethram Austin | అమెరికాలో మరో ఆధ్యాత్మిక క్షేత్రం పురుడు పోసుకుంది. టెక్సాస్ (Texas) రాష్ట్రంలోని ఆస్టిన్ (Austin) నగరంలో భారీ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. 375 కింగ్ రియా జార్జ్ టౌన్ (375 King Rea, George Town)లో హరిహర క్షేత్రం పేరుతో శైవ, వైష్ణవ ఆలయ నిర్మాణం చేపట్టబోతున్నారు.
ఆస్టిన్ నగర శివారులో దాదాపు 25 ఎకరాల విశాలమైన స్థలంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం కొలువుదీరబోతోంది. ప్రస్తుతం ఈ ప్రదేశంలో బాలాలయాన్ని నెలకొల్పారు. ఈ ఆలయంలో భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి, గణపతి, అయ్యప్ప స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.
వినాయక చవితి మొదలు దసరా, దీపావళి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇటీవల శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ కార్యక్రమాల్లో స్థానిక హిందూ కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.
ప్రత్యేక పూజలతోపాటు ఆటపాటలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఈ బాలాలయంలో గణపతి, అయ్యప్ప స్వామి, వేంకటేశ్వర స్వామి నిత్య పూజలు, అర్చనలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
కార్తీక పౌర్ణమికి సామూహిక సత్యనారాయణ వ్రతాలు
హరిహర క్షేత్రంలో కార్తీక మాస శోభ సంతరించకుంది. ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15న సాయంత్రం పెద్ద ఎత్తున సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించనున్నారు. ఈ వ్రతాల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందిస్తోంది ఆలయ కమిటీ. ఆసక్తి ఉన్న భక్తులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లింక్ www.hariharakshethram.com
హరిహర క్షేత్రం సందర్శకులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఈ దివ్య క్షేత్ర సందర్శనకు విచ్చేసిన కుటుంబాలకు పూజల అనంతరం హాయిగా సేదతీరడానికి సౌకర్యాలను అందిస్తుంది. చిన్నారులు ఆడుకునేందుకు వివిధ పరికరాలతో పార్క్ ను కూడా ఏర్పాటు చేశారు.
హరిహర క్షేత్రం క్యాంటీన్..
ఆలయ సందర్శన కోసం వచ్చే భక్తులకు భోజన సదుపాయం కూడా ఉంది. హరిహర క్షేత్రం క్యాంటీన్ స్వచ్ఛమైన రుచికరమైన భోజనం కూడా ఆస్వాదించవచ్చు. ఈ సౌకర్యాలతో, హరిహర క్షేత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణంతో స్థానిక హిందువులకందకీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది.