Saturday 31st January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు’

‘శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు’

One More Food Item In Tirumala Annaprasadam | తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు అందించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ( B R Naidu ) వెల్లడించారు.

ఈ మేరకు మెనూ ( Menu )లో ఒక ఐటమ్ పెంచాలని టీటీడీ ఛైర్మన్ అధికారులను అదేశించారు. ఈ క్రమంలో మెనూలో మార్పులు చేస్తూ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు.

ట్రయల్ రన్ ( Trail Run ) లో భాగంగా సోమవారం 5వేల మసాలా వడలను సిబ్బంది భక్తులకు వడ్డించారు.ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా మసాలా వడలు తయారు చేశారు. మసాలా వడలు రుచికరంగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు బీఆర్ నాయుడు తెలిపారు.

పరిశీలనలో లోటుపాట్లను సరిచేసుకొని పూర్తిస్థాయిలో మెనూలో మార్పులు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

You may also like
కోఠిలో కాల్పులు..ఇదీ జరిగింది!
చర్యలు తీసుకోండి..పవన్ కు బిడ్డను కోల్పోయిన మహిళ వినతి
ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions