Tuesday 29th April 2025
12:07:03 PM
Home > తాజా > దేవర బ్లాక్ బస్టర్..THANK YOU చెప్పిన ఎన్టీఆర్

దేవర బ్లాక్ బస్టర్..THANK YOU చెప్పిన ఎన్టీఆర్

NTR On Devara Success | యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో కొరటాల శివ ( Koratala Siva )తెరకెక్కించిన మూవీ దేవర. ఇటీవలే విడుదలైన దేవర బ్లాక్ బస్టర్ ( Block Buster ) గా నిలిచింది. అలాగే రూ.500 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

ఈ శుభ సమయంలో దేవర మూవీ యూనిట్ ( Movie Team ) కు మరియు అభిమానులకు ఎన్టీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేవర పార్ట్ 1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. దేవర తన హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుందని చెప్పారు.

దర్శకుడు కొరటాల శివకు, నిర్మాతలు సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కోసరాజు కు ధన్యవాదాలు తెలిపారు. సహా నటులు సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ), ఝాన్వీ కపూర్ ( Jhanvi Kapoor ), ప్రకాష్ రాజ్ ( Prakash Raj ), శ్రీకాంత్ మరియు ఇతర నటీనటులు కథకు జీవం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

గత నెలరోజులుగా దేవర సినిమాను పండుగలా జరుపుకుంటున్న కుటుంబసభ్యులైన అభిమానులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు యంగ్ టైగర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఫ్యాన్స్ చూపించే ప్రేమాభిమానాల మూలంగానే తాను ఈ స్థానంలో ఉన్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. దేవర పార్ట్ 1 ను భుజాలపై మోసి, ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ థాంక్స్ చెప్పారు.

You may also like
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!
‘లారీతో ఢీ కొట్టి వేట కొడవళ్ళతో..ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య’
‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’
‘ప్రతీ భారతీయుడి రక్తం మరుగుతోంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions