No Parking Space No Car | మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra) సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించడానికి అక్కడి సర్కార్ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది.
ఇకపై పార్కింగ్ స్థలం (Parking Place)ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే నిబంధనలను అమలులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ (Pratap Sarnaik) ప్రకటించారు.
కార్లు కొనుగోలు చేసేటప్పుడు కొనుగోలుదారులు పార్కింగ్ (car parking) స్థలానికి సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. త్వరలో ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపారు. నగరంలోని పలు అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలకు తగిన పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల తమ కార్లను రోడ్లపై పార్క్ చేయడం వల్ల జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నాయి.
అంతేకాకుండా అంబులెన్స్ లు, ఫైరింజన్స్ అందించే అత్యవసర సేవలకు ఆటంకం కలుగుతుంది. వీటిని నివారించడానికి కార్లు కొనుగోలు చేసే వారు పార్కింగ్కు సంబంధించిన పత్రాలను సమర్పించాలని నిబంధన పెట్టాం” అని ప్రతాప్ సర్నాయక్ పేర్కొన్నారు.









