Nitish Reddy Century | ఆస్ట్రేలియా భారత్ (Aus Vs Ind) మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (BGT)లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (Nitish Reddy) చెలరేగిపోయాడు. మెల్ బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్ట్ (Boxing Day Test) లో నితీశ్ కుమార్ రెడ్డి తొలి సెంచరీ సాధించి, జట్టును ఫాలో ఆన్ నుంచి గండం నుంచి తప్పించాడు.
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన నితీశ్ కీలక ఇన్నింగ్స్ ఆడి, 171 బంతుల్లో తన ఫస్ట్ సెంచరీ సాధించాడు. స్టేడియంలోని ప్రేక్షకులు నితీశ్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి నితీశ్ 105 పరుగులు, సిరాజ్ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 358 పరుగుతు చేసిన భారత జట్టు 116 పరుగులతో వెనకబడి ఉంది.