Nidhi Agarwal News | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనంలో నటి నిధి అగర్వాల్ ప్రయాణించడం పట్ల దుమారం చెలరేగింది. ఇటీవల భీమవరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిధి ఈవెంట్ కు ప్రభుత్వ వాహనంలో వచ్చారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈవెంట్ సందర్భంగా, స్థానిక నిర్వాహకులు తనకు రవాణా కోసం ఏర్పాటు చేసిన వాహనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినదని తెలిపారు.
కానీ సదరు వాహనాన్ని తాను కొరలేదని చెప్పారు. తనకు ఇందులో ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. రవాణా పరమైన అవసరాల కోసం నిర్వాహకులే వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ఈ వాహనం ప్రభుత్వ అధికారులే తనకు పంపారని కొందరు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని నటి వెల్లడించారు. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న తప్పుడు సమాచారం పై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రకటన చేసినట్లు పేర్కొన్నారు.









