New Zealand vs Pakistan | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy )లో ఘోర పరభావాన్ని మూటగట్టుకున్న పాకిస్థాన్ జట్టు ఇప్పటికీ కొలుకోలేదు. ప్రస్తుతం న్యూజీలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది.
దింతో పాక్ అభిమానులు ప్లేయర్లపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్లు పాల్గొన్నారు. కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగిన జట్టును కూడా ఓడించలేకపోతున్నారా అంటూ పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డేవన్ కాన్వే, న్యూజిలాండ్ కెప్టెన్ శాంటర్న్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టామ్ లాథన్ ( Tom Latham ) సారథ్యంలో న్యూజిలాండ్, పాకిస్థాన్ తో తలపడుతుంది. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ దాయాధి దేశం ఓటమిపాలయ్యింది. కీలక ఆటగాళ్లు చేతులెత్తేస్తూ తక్కువ పరుగులకే ఔట్ అవుతున్నారు.