Thursday 29th January 2026
12:07:03 PM
Home > E-Paper > అలెర్ట్.. ఇక నుంచి ఈ యూపీఐ ఐడీలు పనిచేయవు!

అలెర్ట్.. ఇక నుంచి ఈ యూపీఐ ఐడీలు పనిచేయవు!

NCPI New Update on UPI Payments | మన దేశంలో కొన్నేళ్లుగా యూపీఐ పేమెంట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. నగదు కంటే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా భారీగా లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే, 2025 జనవరి 1 నుండి NPCI కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఎక్కువ కాలం ఉపయోగించని యూపీఐ ఐడీలను బ్లాక్ చేయనున్నారు.

ఏడాదికిపైగా ఉపయోగించని యూపీఐ ఐడీలు ఇనాక్టివ్‌గా పరిగణిస్తారు. మొబైల్ నంబర్ మార్చినప్పుడు లేదా కొత్త ఫోన్ నంబర్ తీసుకున్నప్పుడు యూపీఐ ఐడీ మరియు బ్యాంక్ ఖాతా లింకింగ్ మర్చిపోయినవారు ఈ సమస్యను ఎదుర్కొంటారు. 90 రోజుల తర్వాత టెలికాం సంస్థలు ఇనాక్టివ్ నంబర్లను కొత్త వారికి కేటాయిస్తాయి.

దీంతో మోసాలు జరిగే ప్రమాదం ఉంది. ఈ సమస్య నివారించేందుకు NPCI ఇనాక్టివ్ ఐడీలను బ్లాక్ చేయనుంది. గత ఏడాదిలో లావాదేవీలు జరపని యూపీఐ ఐడీలను డీరిజిస్టర్ చేసి, ఇన్‌వర్డ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్లను బ్లాక్ చేస్తారు. అయితే, ఇనాక్టివ్ ఐడీలను తిరిగి యాక్టివ్ చేయవచ్చు. అందుకోసం యూపీఐ యాప్‌లోని మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేయవలసి ఉంటుంది.

You may also like
ajit and sharad powar
అజిత్ పవార్ మృతిపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు!
republic day in kartavy path
కర్తవ్యపథ్ లో గణతంత్ర వేడుకలు!
12 Bikes Skid on a road Within Minutes in uttar pradesh
ఈ రోడ్డుకు ఏమైంది..జారిపడుతున్న బైకులు!
vehicle2vehicle communication
ఇక వాహనాలూ మాట్లాడుకుంటాయ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions