Nassau County Stadium | అమెరికా- వెస్టిండీస్ వేదికల్లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup)లో భాగంగా ఇటీవల ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సహా 8 లీగ్ మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చిన న్యూయార్క్ క్రికెట్ స్టేడియాన్ని అక్కడి సిబ్బంది కూల్చివేయనున్నారు.
106 రోజుల్లోనే రూ. 250 కోట్లు ఖర్చు చేసి న్యూయార్క్ లోని ‘నాసౌ కౌంటీ'(Nassau County) క్రికెట్ స్టేడియాన్ని తాత్కాలికంగా నిర్మించారు. టీ20 ప్రపంచ కప్ కోసమే ఈ స్టేడియాన్ని నిర్మించగా, లీగ్ మ్యాచులు ముగియడంతో స్టేడియాన్ని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధం అయ్యారు.
ఇండియా యూఎస్ఏ మధ్య మ్యాచ్ ముగియగానే స్టేడియాన్ని నేలమట్టం చేయనున్నారు. ఇదిలా ఉండగా అమెరికా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐసీసీ ఈ స్టేడియాన్ని నిర్మించింది. ఇక్కడ డ్రాప్ ఇన్ పిచ్ లను ఏర్పాటు చేశారు. కాగా ఈ పిచ్ లపై విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే.