Wednesday 16th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘మిర్చి మద్దతు ధర..కేంద్రం అంగీకరించింది’

‘మిర్చి మద్దతు ధర..కేంద్రం అంగీకరించింది’

Nara Lokesh News | మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ( Market Intervention Scheme ) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరోసగం భరించేలా మిర్చిరైతులకు క్వింటాలు కనీస మద్దతు ధర రూ.11,781లు చెల్లించేందుకు కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు మంత్రి నారా లోకేశ్.

2024-25 సంవత్సరంలో రైతులు పండించిన 2.58లక్షల టన్నుల మిర్చిని కనీస మద్ధతుధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి వినతికి పెద్దమనసుతో సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీకి ( PM Modi ), కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కి, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా లోకేష్ కృతజ్ఞతలు చెప్పారు.

రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. గత పాలకులు కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే…చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం నిరంతరం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పరితపిస్తోందని లోకేశ్ తెలిపారు.

You may also like
బ్రిటన్ రాజుతో టీం ఇండియా ప్లేయర్లు
భూమిపైకి వచ్చేసిన శుభాంశు శుక్లా
పార్టీ నాయకుడి కుమారుడికి జగన్ నామకరణం
డిప్యూటీ సీఎంకు లీగల్ నోటీసులు పంపిన బీజేపీ చీఫ్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions