Nara Lokesh About Pawan Kalyan Swag | ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వాగ్ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు మంత్రి నారా లోకేశ్.
పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ జులై 24న విడుదల కానుంది. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్ కు మరియు మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
‘మా పవన్ అన్న సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ‘హరిహర వీరమల్లు’ అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.










