Nara Bhuvaneshwari Congratulates Balakrishna | గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెల్సిందే.
సినీ రంగానికి చేసిన కృషికి గాను నటుడు నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది. ఈ క్రమంలో ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.
ఇందులో భాగంగా బాలకృష్ణ సోదరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు.
‘ మా పుట్టింటికి రెండో పద్మం రావడం మా అందరికీ గర్వంగా ఉంది. బాల అన్నయ్య..జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ వంటి చిత్రాలలో నటించి చిత్ర సీమలో 50 ఏళ్ల నట ప్రస్థానం ఇటీవలే పూర్తి చేసుకొని కళామతల్లిని మెప్పిస్తూనే వున్నాడు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం అందుకుని తన వంతు బాధ్యతలు నిర్వహిస్తూ..బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్‌గా కూడా తన సేవలు అందిస్తూ వున్నాడు. మా ముద్దుల బాల అన్నయ్య ఇప్పుడు పద్మభూషణ్ బాలకృష్ణ అయిన సందర్భంగా శుభాకాంక్షలు. ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. అలాగే ఈ ఏట పద్మా పురస్కారాలు అందుకొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు.’ అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.