Nagababu On Pushpa-2 Movie | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వస్తున్న సినిమా పుష్ప-2 ది రూల్.
మరికొన్ని గంటల్లో పుష్ప విడుదల కానున్న నేపథ్యంలో జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
‘ 24 క్రాఫ్ట్ ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో, వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం…అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను ‘ అని నాగబాబు పోస్ట్ చేశారు.