Friday 25th July 2025
12:07:03 PM
Home > తాజా > వాళ్ల ముందు మాట్లాడటానికి భయపడ్డా: సీఎం

వాళ్ల ముందు మాట్లాడటానికి భయపడ్డా: సీఎం

cm revanth reddy
  • మాజీ సీఎం రోశయ్య వర్ధంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Roshaiah) 3వ వర్ధంతి కార్యక్రమాన్ని హైదరాబాద్ లో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోశయ్యతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

శాసనమండలి, శాసనసభలో పోటీ పడి స్పీచ్ ఇవ్వాలన్న స్ఫూర్తిని రోశయ్య తమకు ఇచ్చారని తెలిపారు.  ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రి గా రోశయ్య క్రమశిక్షణ పాటించడం వల్లనే రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఏర్పడిందని పేర్కొన్నారు.

చుక్క రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్,  రోశయ్య లాంటి వారి మధ్య  శాసనమండలిలో ఎమ్మెల్సీ గా మాట్లాడేందుకు తాను భయపడ్డానని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు.

“నీటి పారుదల శాఖ పైన మండలిలో నేను మాట్లాడినప్పుడు నన్ను తన ఛాంబర్ కు పిలిపించుకొని ప్రోత్సహించారు. ప్రతిపక్ష సభ్యుడినైనప్పటికి మండలి గౌరవం పెంచాలన్న ఉద్దేశంతో రోశయ్య నన్ను ఆనాడు ప్రోత్సహించారు. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రశ్నించాలి.

పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని రోశయ్య నాకు సూచించారు. చట్టసభల్లో అనాటి స్పూర్తి కొరవడింది. ప్రతిపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దన్నట్లుగా పరిస్థితులు తయారయ్యాయి. రోశయ్య కుటుంబం రాజకీయాల్లో లేదు.

సీఎంగా, గవర్నర్ గా, వివిధ హోదాల్లో 50 యేళ్ల పైగా రాజకీయాల్లో గొప్పగా రాణించారు. తమిళనాడు గవర్నర్ గా ఎవరు వెళ్లినా వివాదాల్లో కూరుకుపోతుంటారు. కాని రోశయ్య అక్కడ వివాదాలు లేకుండా రాణించారు. ఆనాటి ముఖ్యమంత్రులకు రోశయ్య కుడి భుజంలా వ్యవహారించడం వల్లనే వారు సమర్థంగా పనిచేశారు.

రోశయ్య లాంటి సహచరులు ఇప్పుడు లేకపోవడం పెద్ద లోటు. ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నల నుంచి ప్రభుత్వాన్ని రోశయ్య కంచె వేసి కాపాడేవారు. నెంబర్ 2 స్థానంలో రోశయ్య ఉండాలని ఆ నాటి ముఖ్యమంత్రులు కోరుకున్నారు. ముఖ్యమంత్రి స్థానం కోసం రోశయ్య ఏనాడు తాపత్రయపడలేదు.

పార్టీ పట్ల ఆయన నిబద్ధత కారణంగానే క్లిష్ట సమయంలో రోశయ్యను ముఖ్యమంత్రి చేయాలని సోనియా గాంధీ నిర్ణయించారు. రోశయ్య నిబద్దత కారణంగానే అన్ని హోదాలు ఆయన ఇంటికి వచ్చాయి. సభలో సమస్యలను వ్యూహాత్మకంగా ఎదుర్కొవాలంటే రోశయ్య ఉండాలనే ముద్ర  ఆయన బలంగా వేశారు.

రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైశ్యుల చేతిలో ఉంది.. తెలంగాణ బ్రాండ్  అంబాసిడర్లు కావాలి. ఆర్య వైశ్యుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులైనా ప్రభుత్వం సకాలంలో ఇస్తుంది. రాజకీయాల్లో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఇస్తాం.

నేను హైదరాబాద్ వ్యక్తినని గతంలో రోశయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం. రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సమాజానికి మంచి స్పూర్తి ఇచ్చినట్లైవుతుంది” అని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

You may also like
cm revanth reddy
ఈ ఒక్క పథకం విప్లవాత్మక మార్పులకు కారణమైంది: సీఎం రేవంత్ ట్వీట్!
మాజీ మంత్రి కేటీఆర్ బర్త్ డే.. సోషల్ మీడియాలో కవిత పోస్ట్!
హరిహర వీరమల్లు రిలీజ్.. సీఎం చంద్రబాబు స్పెషల్ విషెస్!
‘తెలంగాణ వ్యక్తిని ఉపరాష్ట్రపతి చేయాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions