Nagababu On HYDRA | రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాలను వరదలు ముంచేస్తున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా ( HYDRA ) పై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ ( Janasena Party ) ప్రధాన కార్యదర్శి నాగబాబు ( Konidela Nagababu ).
” వర్షాలు పడి తూములు తెగిపోయి,చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్మెంట్ లకి కూడ నీళ్లు రావడం,కొన్ని సామన్య ప్రాణాలు కూడ బలికావడం చాల బాధకారం వీటికి ముఖ్య కారణం చెరువుల్ని నాళాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే ..ఇప్పటికైన అర్ధమైందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ) గారు చేబట్టిన హైడ్రా కాన్సెప్ట్” అని అభినందించారు.
సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ ను నాగబాబు కొనియాడారు. అలాగే ఈ విషయంలో సీఎంకు పూర్తి మద్దతు ప్రకటించారు. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది,