Naga Chaithanya – Shobitha Wedding | టాలీవుడ్ నటుడు నాగ చైతన్య (Naga Chaithanya), నటి శోభిత ధూళిపాళ్ల (Shobitha Dhulipalla) వివాహం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది.
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ (Arnapurna Studios) లో అక్కినేని నాగేశ్వర రావు విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో నాగ చైతన్య శోభిత మెడలో తాళి కట్టారు.
అక్కినేని కుటుంబ సమీప బంధువులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అక్కినేని ఫ్యామిలీ అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.