Naa Anveshana Anvesh | నా అన్వేషణ (Naa Anveshana) పేరుతో ప్రపంచ దేశాల పర్యటన చేస్తున్న అన్వేష్ (Anvesh) అనే యూట్యూబర్ ఇటీవల బెట్టింగ్ యాప్ లపై యూట్యూబ్ వేదికగా పోరాటం చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన వారి వివరాలను బహిర్గతం చేస్తూ వరుస వీడియోలు చేస్తున్నాడు.
దీంతో బెట్టింగ్ యాప్ ల ప్రచారంపై రెండు రాష్ట్రాల పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసిన వారిని విచారణకు సైతం పిలిచారు. వైజాగ్ లోకల్ బాయ్ నుంచి తాజాగా కమెడియన్ అలీ వరకు అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్లు, సినీ నటులు బెట్టింగ్ యాప్ లు చేశారంటూ ప్రత్యేకంగా యూట్యూబ్ లో వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు.
అన్వేష్. తాజాగా ఈ బెట్టింగ్ యాప్ బాధితుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. బెట్టింగ్ యాప్ ప్రచారం చేసిన వారిపై రూపొందించిన వీడియోలకు వచ్చిన ఆదాయాన్ని బాధితులకు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.
ఇప్పటి వరకు రూ. 30 లక్షలు వచ్చాయనీ, త్వరలో మరో 30 లక్షలు వస్తే అన్నీ కలిపి 60 లక్షల రూపాయాలను బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయిన వారికి, చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయంగా ఇస్తానని ప్రకటించాడు.