Mumbai Indians Updates | ఐపీఎల్ 2025 లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో ముంబయి ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. వరుస ఓటములు తర్వాత విజయం సాధించడంతో ప్లేయర్లు, అభిమానులు కాస్త ఉపశమనం పొందారు.
అయితే ప్లేఆప్స్ కు చేరాలంటే మాత్రం ముంబయికి వరుస విజయాలు అవసరం. ఇదిలా ఉండగా ముంబయి ఆడిన గత మూడు మ్యాచుల ఫలితాలు 12 పరుగుల చుట్టే తిరగడం గమనార్హం. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి కేవలం 12 పరుగుకు తేడాతో ఓడింది.
ఆర్సీబీ తో మ్యాచులోనూ 12 పరుగుల తేడాతో ఓడింది. ఈ రెండు మ్యాచుల్లో ప్లేయర్లు చివరి వరకు పోరాడినా ముంబయికి ఫలితం లేకుండా పోయింది. ఇకపోతే ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 205 పరుగులు చేసింది. లక్ష్య చేదనకు దిగిన డీసీ మొదట్లో అలవోకగా గెలుస్తుందని అందరూ భావించారు.
కానీ బుమ్రా వేసిన 19వ ఓవర్ లో ముగ్గురు ప్లేయర్లు రన్ ఔట్ అవడంతో ముంబయి గెలిచింది. ఈ మ్యాచులో కూడా ముంబయి 12 పరుగులతోనే విజయాన్ని ముద్దాడింది. రెండు మ్యాచుల్లో 12 పరుగులతో ఓటమి, తర్వాతి మ్యాచులో 12 పరుగులతో గెలుపు. గత మూడు మ్యాచుల్లో 12 పరుగుల తేడాతో ముంబయి రెండు ఓటములు, ఒక గెలుపు చూడడం ఆసక్తిగా మారింది.