MS Dhoni breaks silence on retirement ahead of CSK vs MI | చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
గతేడాది జరిగిన ఐపీఎల్ తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. వాటిని పటాపంచలు చేస్తూ ధోని ప్రస్తుత ఐపీఎల్ కోసం సాధన చేస్తున్నారు. అయితే 2025 ఐపీఎల్ ధోనీకి చివరిదని మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. తాజగా జరుగుతున్న ప్రచారంపై స్వయంగా ధోనినే స్పందించారు.
‘ చెన్నై సూపర్ కింగ్స్ ఇది నా ఫ్రాంచైజీ. సీఎస్కే తరఫున ఆడుతూనే ఉంటా. ఒకవేళ నేను వీల్ ఛైర్ లో ఉన్నా లాక్కెళ్తారు’ అని ధోని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ ఇప్పట్లో లేదని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. గత ఐపీఎల్ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన ధోని సిక్సర్లతో విజృంభించారు.