MLC K Kavitha Begins 72-Hour Hunger Strike For 42% BC Reservations | బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. ధర్నాచౌక్ వద్ద ఆమె సోమవారం దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీల కోసం తీసుకువచ్చిన 42 శాతం రిజర్వేషన్ బిల్లులో ముస్లింలకు కోటా ఉందా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ లేకపోతే ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మరొక బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లలో ముస్లింలు కూడా ఉన్నారని బీజేపీ దాటవేసే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. అలాగే బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.
ఇదిలా ఉండగా నిరాహారదీక్ష ప్రారంభించడానికి ముందు తన నివాసంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన అత్తమామలు దేవనపల్లి రాంకిషన్ రావు – నవలత, భర్త అనిల్ ఆశీర్వాదం తీసుకున్నారు.









