BJP MLA Ganesh Chandra | ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh)లో ఓ ఎమ్మెల్యే చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సంత్ కబీర్ నగర్ (Sant Kabir Nagar) జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ చంద్ర (MLA Ganesh Chandra) తన డ్రైవర్ పెళ్లికి డ్రైవర్గా మారారు.
ఆ నూతన వరుడిని ప్యాసింజర్ సీట్లో కూర్చోబెట్టి తానే స్వయంగా కార్ నడుపుకొంటూ ఊరేగింపుగా వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎమ్మెల్యే గణేష్ చంద్ర కళ్యాణ మండపం వద్దకు కారు నడుపుతుండగా ఆయన పక్కనే వరుడు కూర్చోవడం చూసి పెళ్లికి వచ్చిన అథితులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే సింప్లిసిటీకీ, హుందాతనానికి ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన డ్రైవర్ విపిన్ మౌర్యతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.
తన జీవితం ప్రతిరోజు అతడి చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. విపిన్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు కాబట్టి అతడినే తానే స్వయంగా వివాహ వేదికకు తీసుకెళ్లాలని భావించినట్లు వివరించారు.









