– ఉరుగ్వే – ఆస్ట్రియా మ్యాచ్ను ప్రారంభించిన మంత్రి సీతక్క!
Uruguay vs Austria Hockey | నగరంలోని గచ్చిబౌలి హాకీ స్టేడియం అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలిచింది. మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ (World Cup Qualifiers) లో భాగంగా ఉరుగ్వే – ఆస్ట్రియా జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ను మంత్రి సీతక్క మరియు మాజీ క్రికెటర్, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు అజారుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
క్రీడాకారిణులకు ఆల్ ది బెస్ట్
మ్యాచ్ ప్రారంభానికి ముందు మంత్రి సీతక్క ఇరు జట్ల క్రీడాకారిణులను వ్యక్తిగతంగా పరిచయం చేసుకున్నారు. క్రీడాస్ఫూర్తితో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని కోరుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి పోటీలు తెలంగాణలో నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణలో తొలి క్రీడా విశ్వవిద్యాలయం
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.
యువత కోసం ఆధునిక క్రీడా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలి క్రీడ యూనివర్సిటీని తెలంగాణలో ప్రారంభిస్తున్నట్లు ఆమె కీలక ప్రకటన చేశారు.
మహిళా క్రీడాకారిణులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, క్రీడలు క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో SATG చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి, తెలంగాణ హాకీ అసోసియేషన్ సెక్రటరీ భీమ్ సింగ్ మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన క్రీడాభిమానులు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ను వీక్షించి క్రీడాకారిణులను ఉత్సాహపరిచారు.






