Monday 28th July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ప్రకాశం బ్యారేజీకి హాని తలపెట్టాలని వైసీపీ కుట్ర: మంత్రి నిమ్మల

ప్రకాశం బ్యారేజీకి హాని తలపెట్టాలని వైసీపీ కుట్ర: మంత్రి నిమ్మల

nimmala ramanaidu

Minister Nimmala Ramanaidu | ప్రకాశం బ్యారేజీ (Prakasham Barriage)కి హాని తలపెట్టాలనే వైసీపీ (YCP) కుట్రలో భాగంగా ఐదు పడవలు కొట్టుకు వచ్చినట్లు అనుమానాలు బలపడుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అధికారులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్త పరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒకే యజమానికి చెందిన మూడు బొట్లు ఉన్నాయని మంత్రి చెప్పారు.

నందిగం సురేష్, తలశిల రఘురాం కు బోటు యజమాని ఉషాద్రి రామ్మోహన్ దగ్గరి మనిషని, బొట్లకు వైసీపీ రంగులు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని మంత్రి తెలిపారు.

సుమారు రూ. కోటిన్నర విలువ చేసే బొట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎవరైనా ఉంటారా ? అని ప్రశ్నించారు. పై స్థాయి నుండి ఆదేశాలు వచ్చివుండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

50 టన్నుల బరువు ఉన్న బొట్లు కౌంటర్ వెయిట్లను బలంగా ఢీ కొట్టాయని, అదృష్టవశాత్తూ ప్రకాశం బ్యారేజీ కట్టడానికి, గేట్లకు ఇబ్బంది రాలేదని మంత్రి క్లారిటీ ఇచ్చారు.

You may also like
‘మహిళలకు రూ.1500..అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాలి’
ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు..నారా భువనేశ్వరి ఆగ్రహం
తోడు కోసం పెళ్లి చేసుకుంటే..భర్త కాదు మోసగాడు !
అమ్మ కోసం..అధికార యంత్రాంగాన్నే కదిలించిన బాలుడు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions